యూట్యూబ్ చానెల్స్‌కి వార్నింగ్ ఇచ్చిన ఆది.. కష్టపడి సంపాదించుకోండి అంటూ సెటైర్
on Aug 7, 2023
మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ భోళా శంకర్. ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంటులో హైపర్ ఆది కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడు సైనికుడిని అవుతా అని యుద్ధ భూమికి బయల్దేరాడు. ఆ యుద్ధ భూమిలో కండలు తిరిగిన సైనికులు యుద్దం చేస్తున్నారు, గెలుస్తున్నారు.. ఈయన చూస్తుండగానే అవకాశం వచ్చింది ..ఒక రోజు ఈయన యుద్ధం చేసి గెలిచారు. ఒక ముప్పై ఏళ్లు యుద్ధభూమిని ఏలారు. ఆయన ఎవరో కాదు... మెగాస్టార్ చిరంజీవి.
అన్నయ్య ఇంత మంది సినీ సైనికులను తయారుచేసిన ఇంద్రాసేనాని ఐతే తమ్ముడేమో.. జనసైనికుల్ని తయారు చేసి జనసేనాని అయ్యారు అని అన్నారు హైపర్ ఆది. బేసిక్ గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ ఆయనకు హీరోలే ఫ్యాన్స్ గా ఉంటారు.. ఆస్తులు సంపాదించడం కన్నా... అభిమానాన్ని సంపాదించుకున్నారు. నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి, సచిన్ టెండూల్కర్ ఒకటే. సచిన్ ని ఎవరైనా ఏమన్నా అంటే బ్యాట్ తో సమాధానం చెప్తారు. చిరంజీవిని ఏమన్నా అంటే సినిమాతోనే సమాధానం చెప్తారు. అలాగే కొన్ని యూట్యూబ్ చానెల్స్ కి కూడా ఆది ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. హీరో ఉదయ్ కిరణ్, హీరో సుమన్ విషయాల మీద ఫేక్ న్యూస్ రాసి డబ్బులు ... సంపాదించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కష్టపడి సంపాదించుకోండి ఇలాకాదు. టాలీవుడ్ లోనే ఓ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన్ను అనే స్థాయి నాకు లేదు. అలాగే మెగాస్టార్ ను, పవర్ స్టార్ ను అనే స్థాయి ఆయనకు లేదు. చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్ ను.. పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్ స్టార్ ను విమర్శిస్తుంటారు. వాళ్లకి చెబుతున్నాను.. అర్థం లేని మాటలకు క్లాప్స్ రావు.. అర్థం లేని సినిమాలకు కలెక్షన్స్ రావు.. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసి కొటాడతాయి. తర్వాత రామ్ చరణ్ తేజ్ ని కూడా అమాంతం ఆకాశానికి ఎత్తేసాడు ఆది. కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఈరోజు గ్లోబల్ స్టార్ అయ్యాడన్నారు." హైపర్ ఆది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
