జబర్దస్త్ కమెడియన్ కి గౌరవ డాక్టరేట్
on Sep 3, 2018
జబర్దస్త్ షో తో గుర్తింపు తెచ్చుకున్న గాలిపటాల సుధాకర్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.. అయితే తాజాగా సుధాకర్ కు తమిళ నాడుకు చెందిన కోయంబత్తూర్ రాయల్ అకాడమి ఆర్ట్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.. కళారంగంలో దేశవ్యాప్తంగా దాదాపు ఐదువేల స్టేజీ ప్రదర్శనలు ఇచ్చినందుకుగాను యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ అవార్డ్‌ను ప్రకటించింది.. ఈనెల 8న దుబాయ్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆయనకు ఆ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నారు.