ENGLISH | TELUGU  

అమెరికాలో చిరు ఈవెంట్.. మా లో చిచ్చు.!!

on Sep 3, 2018

‘మా’ అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా ఆ సంఘం నిధులను మింగేశాడని, మెగా ఈవెంట్‌తో వచ్చిన నిధుల నుంచి కొంత దుర్వినియోగం చేశాడని ఓ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది.. 'మా' సొంత భవన నిర్మాణానికి విరాళాల సేకరణకు అమెరికాలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రజతోత్సవ కార్యక్రమం నిర్వహించారు.. ఆ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను కొంత మంది 'మా' ప్రతినిధులు తమ సొంత జేబుల్లో వేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ నిధుల దుర్వినియోగంలో శివాజీరాజాతో పాటు శ్రీకాంత్ కూడా ఉన్నట్టు వార్తలొచ్చాయి.. అయితే ఈ వార్తలను శివాజీరాజా, శ్రీకాంత్ ఖండిస్తున్నారు.

 

 

'మా' రజతోత్సవంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఒకవేళ అవకతవకలు జరిగాయని నిరూపిస్తే ‘మా’ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటామని శివాజీరాజా, శ్రీకాంత్‌ ప్రకటించారు.. అంతేకాదు, నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుంటానని శివాజీ రాజా సంచలన ప్రకటన చేశారు.. త్వరలో ‘మా’ ఎన్నికలు రాబోతున్నందుకే తమపై ఆరోపణలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. చిరంజీవి అతిథిగా వచ్చిన 'మా' రజతోత్సవానికి కోటి రూపాయలు వచ్చాయని, త్వరలో మహేష్‌తో కార్యక్రమం చేపట్టబోతున్నామని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు.. చిరంజీవితో ప్రోగ్రాం చేస్తే చాలా తక్కువ డబ్బులు వచ్చాయని అంటున్నారు.. ఆయన స్టామినా ఇంతేనా? అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు వారు స్పందిస్తూ ఆయన స్టామినా లెక్కించే అర్హత మాకు లేదు.. చిరంజీవి సపోర్టే మాకు స్టామినాగా ఫీలవుతాం.. అమెరికాలో ప్రోగ్రాం నిర్వహించడానికి 50 మంది మెంబర్స్ వెళ్లాం. వారికి ఫ్లైట్ ఖర్చులు, లోకల్ ట్రావెలింగ్, ఫైవ్ స్టార్ హోటల్ ఖర్చులు చాలా అయ్యాయి.. అన్నింటికీ లెక్కలు ఉన్నాయి.. చిరంజీవి స్టామినా ఇంతేనా? అనేది సరైంది కాదు అన్నారు.

 

 

చిరంజీవి గారి ప్రోగ్రాం కాబట్టి మేము చాలా డబ్బు అడగటం జరిగింది.. కానీ వారు ఇంత అయితేనే ఇవ్వగలం అన్నారు.. ఆ సమయంలో చాలా మంది చిరంజీవి గారు రారు అనే ప్రచారం కూడా చేశారు.. ఇప్పటి వరకు అమెరికాలో ఇంత పెద్ద కార్యక్రమం ఎవరూ చేయలేదు.. డల్లాస్‌లో ఉండే వారిపై నమ్మకంతో వారికి ఆర్గనైజింగ్ బాధ్యత అప్పగించామని శ్రీకాంత్ తెలిపారు.. మీరు చేస్తున్న ఆరోపణల గురించి మాకు తెలియదు.. ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు లేదు.. అగ్రిమెంటు ప్రకారం డబ్బులు వచ్చాయా? లేదా?.. డబ్బు వచ్చినపుడు ఆర్గనైజర్ల గురించి మనకెందుకు?.. వాళ్లకు లాస్ వచ్చినా మనం ఇవ్వం, వాళ్లకు ప్రాఫిట్ వచ్చినా మనం తీసుకోం.. వాళ్లు ఎక్కడి నుండి పెట్టారు? ఎన్ని సీట్లు ఫిల్ చేశారు? ఇవన్నీ మాకు అనవసరం.. మన డబ్బులు మనకు వచ్చాయా? లేదా? అనేదే ముఖ్యం అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.. నిధులు దుర్వినియోగం అయినట్లు ఎవరైతే ఆరోపణలు చేశారో, అగ్రిమెంటు కంటే ఐదు పైసలు తక్కువ వచ్చి ఉన్నా నేను ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గడపకూడా తొక్కను.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ షిప్ కూడా కేన్సిల్ చేసుకుంటాను.. ఇది నా ఓపెన్ చాలెంజ్.. అదే వారు ప్రూవ్ చేయకపోతే నేను చేసే పని చేస్తారా? అంటూ శ్రీకాంత్ సవాల్ విసిరారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.