బిగ్ బాస్‌పై హేమ బిగ్ కాంట్రవర్సీ
on Jul 31, 2019
`బిగ్ బాస్` నుంచి ఫస్ట్ వీక్ లోనే బయటకు వచ్చేసింది నటి హేమ. ఇక బిగ్ బాస్ నుంచి సంచలన నిజాలు బయటపెట్టింది. అయితే ఈ రోజు ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బిగ్ బాస్ లో జరుగుతున్న గుట్టు రట్టు చేసింది. ఒకసారి ఆ వివరాలలోకి వెళితే....`` నేనేమి ప్లాన్ చేసుకొని బిగ్ బాస్ లోకి వెళ్లలేదు. అక్కడి వాతావరణం అర్ధం చేసుకునే లోపే బయటకు వచ్చేసాను. ఇక అక్కడ ఉండలేక గోడ దూకి పారిపోయాలనుకునే లోపే బయటకు పంపారు. ఇక నేను ఆ హౌస్ లో డామినేషన్ ఏమి చేయలేదు. ఇక నేను అందరి మంచి కోసము చెప్పిన వాటిని చూపకుండా కేవలం...నేను అరిచినవి మాత్రమే చూపారు. హౌస్ మేట్స్ గురించి చెబుతూ... వరుణ్ సందేశ్, శ్రీముఖి బాగా నటిస్తున్నారు. శ్రీముఖి అత్తెంతిఒన్ పొందాలని చూస్తుంది. ఇక బాబ్ భాస్కర్ అందరి తో మంచి అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఇక జర్నలిస్ట్ కాబట్టి జాఫర్ హుందాగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనను వితిక, శ్రీముఖి ఇద్దరూ తనను బాడ్ చేయటానికి ట్రై చేస్తున్నారు. ఇంటా , బయటా హిమజ మ్యానుప్లేషన్ చేస్తుంది. అలీ బాగా ఆడుతున్నాడు. రోహిణి అందర్నీ నమ్మేస్తుంది. ఇక సావిత్రి తన ఫామిలీ , తన ఇల్లు సెంటిమెంట్ లోనే ఉంది. ఆషు రెడ్డి కి కొన్ని రోజులు అయితే కానీ రియాలిటీ ఏంటి అనేది తెలియదు. మహేష్, వరుణ ఇంకా పెద్ద గొడవ అయ్యింది కానీ కొంచెమే చూపించారు. ఇక హౌస్ లో ఉన్న వారందరికీ నేను ఇష్టమే అంటూ చెప్పుకొచ్చింది.