ENGLISH | TELUGU  

హారీస్‌ జయరాజ్‌ కిడ్నాప్..?

on May 13, 2014

Harris Jayaraj Driver Held For Kidnap Attempt, Harris Jayaraj Kidnaped, Harris Jayaraj Gets A Kidnap, Kidnap Threat To Harris Jayaraj

ప్రముఖ సంగీత దర్శకుడు హారీస్‌ జయరాజ్‌ని  కిడ్నాప్  చేసేందుకు జరిగిన  ప్రయత్నం విఫలమయ్యింది. ఈ వార్తా ప్రస్తుతం సినీ  పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ వార్త వెలుగులోకి రావడంతో జయరాజ్ అభిమానులు కంగారుపడ్డారు. అయితే కిడ్నాప్ కు  ప్రయత్నించిన వారి అరెస్టుతో అంతా సర్దుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు  హారీస్‌ జయరాజ్‌ చెన్నైలోని వలసరవాక్కంలో నివసిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన  ఇంటికి ఎవరో  గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి, వెంటనే రూ.20 లక్షల మొత్తాన్ని అందజేయాలని హెచ్చరించారట. డిమాండ్‌ను  అంగీకరించకపోతే హారీస్‌ జయరాజ్‌ను అపహరిస్తామని ఆ ఆగంతకులు బెదిరించారట. ఈ విషయమై హారీస్‌ జయరాజ్‌ కుటుంబీకులు  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని తిరునెల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన అరుణాచల పాండ్యన్‌ ముత్తుకృష్ణన్‌ తిరుమలై గా గుర్తించారు అని తెలుస్తోంది. తిరుమలై హరీష్ జయరాజ్ తండ్రి  వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసి ఉండటం  ఈ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.