'కేజీఎఫ్' నటుడితో నాని హీరోయిన్ ఎంగేజ్ మెంట్
on Dec 5, 2022

కన్నడ బ్యూటీ హరిప్రియ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'తకిట తకిట'(2010) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. 'పిల్ల జమిందార్', 'జై సింహ' వంటి సినిమాలతో అలరించింది. ప్రస్తుతం వరుస కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకుంది.
కన్నడ నటుడు వశిష్ట సింహాతో హరిప్రియ కొంతకాలంగా ప్రేమలో ఉంది. 'కేజీఎఫ్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వశిష్ట.. 'నారప్ప', 'ఓదెల రైల్వే స్టేషన్' వంటి తెలుగు సినిమాలలోనూ నటించి మెప్పించాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వశిష్ట-హరిప్రియ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హరిప్రియ నివాసంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



