పవన్ సర్ ప్రైజ్ లుక్.. పక్కా ప్లానింగ్ తో 'హరి హర వీరమల్లు' టీమ్!
on Sep 30, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ఇది పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా ఫిల్మ్. ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న కారణంగా కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ ఇప్పుడు మళ్ళీ 'హరి హర వీరమల్లు'కి సమయం కేటాయిస్తున్నారు.
"నవరాత్రులలో నవ ఉత్తేజం" అంటూ తాజాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో పవన్ లుక్ సర్ ప్రైజింగ్ గా ఉంది. ఆయన యంగ్ గా, చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పవన్ స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.
కీరవాణి షేర్ చేసిన ఫొటోలో 'హరి హర వీరమల్లు.. వర్క్ షాప్' అనే పోస్టర్ కనిపిస్తోంది. అక్టోబర్ రెండో వారం తర్వాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానున్న క్రమంలో.. ప్రధాన తారాగణం, ముఖ్య సాంకేతిక నిపుణులతో కలిసి మూవీ టీమ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే 'హరి హర వీరమల్లు' టీమ్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్టు అర్థమవుతోంది.
ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా జ్ఞానశేఖర్, ఎడిటర్ గా శ్రవణ్ వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
Also Read