తెలంగాణాలో హరిహరవీరమల్లుకి మంచి జరిగేలా చేసింది ఇతనే
on Jul 22, 2025

అల్లు అర్జున్(Allu Arjun)నటించిన పుష్ప 2(Pushpa 2)మూవీ గత డిసెంబర్ లో రిలీజైనప్పుడు, హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణాలో ఒక పై బెనిఫిట్ షో లు ఉండవని, టికెట్ రేట్స్ కూడా పెంచటం కుదరదని చెప్పాడు. కానీ ఈ నెల 24 న విడుదల కానున్న పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు' కి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణా ప్రభుత్వం కూడా ప్రీమియర్ షో తో పాటు అదనపు షోస్, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
ఈ విషయంపై హరిహర వీరమల్లు నిర్మాత 'ఏఎం రత్నం'(Am Rathnam)మాట్లాడుతు 'మేం మొదట తెలంగాణ గవర్నమెంట్ ని సంప్రదించినప్పుడు అదనపు షోస్, టికెట్ రేట్స్ పెంచడం కుదరదని తేల్చి చెప్పారు. కానీ రోహిన్ రెడ్డి(Rohin Reddy)ఈ విషయంలో కల్పించుకొని మాకు అదనపు షోస్, హైక్ వచ్చేలా చేసారని చెప్పడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో రోహిన్ రెడ్డి ఎవరనే చర్చ జరుగుతుంది. రోహిన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతు వస్తు ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad)జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరుపున కీలక బాధ్యతలని నిర్వహిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి అనే పేరు కూడా క్యాడర్ లో ఉంది.
సినిమాల పరంగా కూడా చూసుకుంటే 'సాయిధరమ్ తేజ్' తో 'తిక్క'అనే సినిమాని నిర్మించాడు. మెగా ఫ్యామిలీ తో కూడా రోహిన్ రెడ్డి కి ఎప్పట్నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



