'హరి హర వీరమల్లు' బుకింగ్స్ కి ఊహించని రెస్పాన్స్!
on Jul 22, 2025

తెలుగునాట తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు 'హరి హర వీరమల్లు'తో పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టార్ పవర్ చూపిస్తున్నారు. (Hari Hara Veera Mallu)
జూలై 24న 'హరి హర వీరమల్లు'తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే పవన్ కొన్నేళ్లుగా సినిమాల కంటే రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దానికి తోడు 'వీరమల్లు' ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన సినిమా. పలుసార్లు వాయిదా పడి ఇంతకాలానికి విడుదలవుతోంది. దీంతో ఈ సినిమాపై పెద్దగా హైప్ లేదని, పవన్ రేంజ్ కి తగ్గ ఓపెనింగ్స్ రావడం కష్టమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వీరమల్లు దూసుకుపోతోంది. (HHVM Bookings)
తాజాగా 'హరి హర వీరమల్లు' బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం బుక్ మై షోలో గంటకు 12 వేల టికెట్లు బుక్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. పూర్తిస్థాయి బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఈ నెంబర్ ఎన్నో రెట్లు పెరిగే అవకాశముంది.
'హరి హర వీరమల్లు' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలకు, టికెట్ రేట్ల పెంపుకి అనుమతి లభించింది. అలాగే జూలై 23 రాత్రి నుంచే షోలు మొదలు కానున్నాయి. ఇవన్నీ కలిసొచ్చి ఓపెనింగ్స్ పరంగా 'వీరమల్లు' మూవీ సంచలనం సృష్టించే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



