ENGLISH | TELUGU  

"గ్రేట్ గ్రాండ్ మస్తీ" రివ్యూ!

on Jul 15, 2016

నటీనటులు: రితేష్ దేశ్ ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్, ఊర్వశి రొటేలా, మిస్తీ చక్రవర్తి, శ్రద్ధా దాస్, పూజా బోస్ తదితరులు..

సాంకేతికవర్గం:

సంగీతం: సంజీవ్ దర్షన్
ఛాయాగ్రహణం: నిగమ్ బొంజాన్
నిర్మాణం: బాలాజీ మోషన్ పిక్చర్స్
దర్శకత్వం: ఇంద్రా కుమార్
విడుదల తేదీ: 15/7/2016

బాలీవుడ్ లో ఎడల్ట్ కామెడీ చిత్రాలకు బీజం వేసిన సినిమా "మస్తీ". కథానాయికల శృతి మించిన అందాల ప్రదర్శన, కథానాయకుల నోట డబుల్ మీనింగ్ డైలాగుల సమ్మేళనంగా వచ్చిన "మస్తీ" సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి. తాజాగా వచ్చిన మూడో భాగం "గ్రేట్ గ్రాండ్ మస్తీ". ఇంద్రా కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రెండీ ఎడల్ట్ ఎంటర్ టైనర్ నిజానికి జూలై 22న విడుదలకావాల్సి ఉన్నప్పటికీ.. రెండు వారాల క్రితమే ఇంటర్నెట్ లో పైరసీ ప్రింట్ దర్శనమివ్వడంతో.. ఒకవారం ముందు అనగా నేడు (జూలై 15) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ తాజా ఎడల్ట్ కామెడీ ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: అమర్ సక్సేనా (రితేష్ దేశ్ ముఖ్), మీట్ మెహ్తా (వివేక్ ఒబెరాయ్), ప్రేమ్ చావ్లా (అఫ్తాబ్).. ముగ్గురూ మంచి స్నేహితులు. చెప్పుకొనేంత కష్టాలు ఏమీ లేకపోయినప్పటికీ.. వారి భార్యల బంధువుల కారణంగా జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటారు. అందుకే ఊరి చివర ఉన్న బంగ్లాను అమ్మే పేరుతో సరదాగా ఎంజాయ్ చేయాలనుకొంటారు. ఆ బంగ్లాలో వారికి ఒక సూపర్ సెక్సీ పనమ్మాయి రాగిణి (ఊర్వశి రోటెలా) కనిపిస్తుంది. రాగిణితో ఎప్పట్నుంచో అనుఛుకొన్న కోరికలను తీర్చుకోవాలనుకొంటారు అమర్ అండ్ గ్యాంగ్.

అయితే.. కొద్ది రోజుల్లోనే వారు అనుకొంటున్నాట్లుగా రాగిణి అదిరిపోయే సెక్సీణి మాత్రమే కాదని, కొన్ని ఏళ్లుగా ఆ భవనంలోనే తిరుగుతున్న ప్రేతాత్మ అని తెలుసుకొంటారు. కన్య గానే చనిపోయిన రాగిణి ఈ ముగ్గురు స్నేహితుల ద్వారా తన కామాన్ని తీర్చుకోవాలనుకుంటుంది.
మరి రాగిణి కోరిక నెరవేరిందా ?
రాగిణి బారి నుంచి అమర్ అండ్ బ్యాచ్ తప్పించుకోగలిగారా? వంటి ప్రశ్నలకు వీలైనంత అసభ్యతను, శృంగారాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రమే "గ్రేట్ గ్రాండ్ మస్తీ".

నటీనటుల పనితీరు:

ఇప్పటికే ఈ తరహా ఎడల్ట్ ఎంటర్ టైనర్స్ లో నటించీ నటించీ బాగా అలవాటైపోయినట్లుంది... రితేష్, వివేక్, అఫ్తాబ్ లు తమ పాత్రల్లో జుగుప్సకరమైన పనులు చేస్తూ జీవించేశారు. సినిమా మొత్తం సెక్స్ ఎలిమెంట్స్ తో నిండిపోవడం వలన.. నటీనటుల పనితీరు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకుండాపోయింది. హీరోయిన్స్ గా నటించిన మిస్తీ చక్రవర్తి ("చిన్నదాన నీకోసం" ఫేమ్), శ్రద్ధాదాస్ లు కేవలం సినిమాలో అలంకారప్రాయంగానే వినియోగించబడ్డారు. ఇక రోమాంటిక్ దెయ్యంగా ఊర్వశి రొటేలా ఏమాత్రం మొహమాటపడకుండా ఆరబోసిన అందాలు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తాయి. కొన్ని చోట్ల శృతి మించినట్లు అనిపించినా ఈ సిరీస్ లో ఇంతకుమునుపు వచ్చిన చిత్రాలతో కంపేర్ చేస్తే "అబ్బే మరీ అంత కాదులెండి" అనిపిస్తుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేయడానికి విశ్వప్రయత్నం చేసి.. బొటాబోటి మార్కులతో పాస్ అయ్యారు.

సాంకేతికవర్గం పనితీరు:

సంజీవ్ దర్శన్ బాణీలు బాగున్నాయి. టైటిల్ సాంగ్ మరియు ఐటెమ్ సాంగ్ కు విజిల్స్ పడడం ఖాయం. ఆ పాటల చిత్రీకరణ రోమాంచితంగానే ఉందనుకోండి. నిగమ్ బోంజాన్ కెమెరాపనితనం మరీ బ్రైట్ గా ఉంది. ఎంత సెక్స్ కంటెంట్ ఉన్నప్పటికీ.. సినిమాలోనూ చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అన్నీ ఎమోషన్స్ ను ఒకేలా పిక్చరైజ్ చేశాడు. అందువల్ల ప్రటిక్యులర్ సీన్స్ కు ఆడియన్ పెద్దగా రియాక్ట్ అవ్వడు.

ఒక కన్నె దెయ్యం, ముగ్గురు పెళ్ళైన యువకులు వీళ్ళ మధ్యలో జరిగే శృంగారపోరాటం కీలకాంశంగా దర్శకుడు ఇంద్రా కుమార్ రాసుకొన్న కథలో అసలు డెప్త్ లేదు సరికదా.. కథనంలో ఆకట్టుకొనే అంశం ఒక్కటి కూడా కనపడదు. ముఖ్యంగా.. ముగ్గురు హీరోల చేత కార్లో రోడ్డు మీద "హస్త ప్రయోగం" చేస్య్కోమని బెదిరించే సన్నివేశం, డైనింగ్ టేబుల్ మీద ఉన్న దెయ్యం పాత్రధారి అయిన ఊర్వశి రొటేలా చేసే విపరీత చేష్టలు మరీ అసభ్యకరంగా ఉన్నాయి. ఎంత ఎడల్ట్ సినిమా అయినప్పటికీ.. మరీ నీచమైన స్థాయిలో ఉన్న ఈ తరహా సన్నివేశాలు మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు రుచించకపోవచ్చు.

విశ్లేషణ:

మన ఇండియాలో "సెక్స్" అనే విషయం గురించి మాట్లాడుకోవడానికి జంకుతారేమో కానీ.. అడల్ట్ జోకులు చెప్పుకోవడానికి, మెసేజ్ ల రూపంలో ఫార్వార్డ్ చేసుకోవడానికి మాత్రం అస్సలు ఇబ్బందిపడరు. అందుకే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొంటూ ఇప్పటికే చాలా సినిమాలోచ్చాయి. మొన్నామధ్య వచ్చిన "మస్తీ జాదే, క్యా కూల్ హై హమ్" లాంటి సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ సదరు సినిమాల్లో హీరోయిన్ల అందాల ప్రదర్శన పుణ్యమా అని కలెక్షన్లు కుమ్మేసాయి. కానీ.. "గ్రేట్ గ్రాండ్ మస్తీ" విషయంలో లెక్క తప్పింది. ఇప్పటికే ఊర్వశి అందాలన్నిట్నీ పలు వీడియో సాంగ్స్ మరియు డ్యాన్స్ ఈవెంట్స్ లో జనాలు ఆస్వాదించేసి ఉండడంతో కొత్తగా ఆమె చూపించేది, జనాలు చూసేదీ ఏమీ లేదు, ఇక సినిమాలో వచ్చే అడల్ట్ జోక్స్ ను ఎవరో తప్పితే ఎంజాయ్ చేయలేరు. అన్నిటికంటే ముఖ్యంగా.. సినిమా రెండు వారాల ముందే ఇంటర్నెట్ లో క్లీన్ ప్రింట్ విడుదలైపోవడంతో ఈ సినిమాను థియేటర్ కి వచ్చి ఎంత మంది చూస్తారనేది చెప్పలేం.. ఇక ఏదో చూద్దామని ఆశించి థియేటర్ కి వచ్చే కాస్తమందినీ సినిమా అనుకొన్న స్థాయిలో ఎంటర్ టైన్ చేయలేదు.

రేటింగ్: 1.5/5

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.