Home

»

Latest News

నిత్యామీనన్‌ని "పొట్టి" అన్న నితిన్..

Jul 15, 2016 11:20AM

హీరోయిన్‌ నిత్యామీనన్‌ని హీరో నితిన్‌ స్టేజి మీద అందరి ముందు "పొట్టి" అనేశాడు. అయితే అది సీరియస్‌గా కాదులేండి..? ఫ్రెండ్‌షిప్‌తో..! నటనతో, గాత్రంతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన నిత్య..ఎంతోమంది యువ హీరోలకు బెస్ట్ ఛాయిస్. తన ఫ్రెండ్లి నేచర్‌తో అందిరిని కలుపుకుపోతూ మంచి స్నేహితురాలిగా పేరు తెచ్చుకుంది.

నిత్య నటించిన "100 డేస్ ఆఫ్ లవ్" సినిమా ఆడియో లాంఛ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిత్య స్నేహితులు హీరోలు నాని, నితిన్‌లు ఆమెకు విషెస్ చెప్పడానికి వచ్చారు. నితిన్ మాట్లాడుతూ తాను పనిచేసిన అందరి హీరోయిన్లలో నిత్యామీనన్ "బెస్ట్ యాక్ట్రస్" అని కితాబిచ్చారు. "ఇష్క్" సినిమాలో ఫస్ట్ టైం నిత్యతో నటించానని, అప్పటికీ, ఇప్పటికీ కూడా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదని, చాలా అందంగా, యంగ్‌గా, పొట్టిగా అలానే ఉందని, ఆమెతో కలిసి మళ్లీ నటించాలని ఉందని నితిన్ అన్నారు. ఈ చిత్రం విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com