ఒకరోజు ముందే 'బాహుబలి' చూడవచ్చు
on Jun 20, 2015
.jpg)
రెండేళ్లుగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి. జులై 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే దానికి ఒకరోజు ముందుగానే ఈ సినిమాను జనం చూసే అవకాశం వుందట.
హిందీలో ఈ సినిమా హక్కులు కొన్న కరణ్ జోహార్ సినిమాను బాలీవుడ్ పెద్దలకు ముందే చూపించాలని డిసైడ్ అయ్యారట. జులై 9న ముంబైలో బాహుబలి గ్రాండ్ ప్రీమియర్ షోను ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రీమియర్ కి బాలీవుడ్ సూపర్ స్టార్లు హాజరవుతారని తెలుస్తోంది.
అలాగే ఆంధ్రా, తెలంగాణాలో కూడా భారీ ప్రీమియర్లు వుంటాయని సమాచారం. దాని కోసం ఇప్పటి నుంచే చాలా మంది కొనుగోళ్లు, ఏర్పాట్లు చేసుకుంటున్నారట. సో ఒకరోజు ముందే బాహుబలి రిజల్ట్ బయటకు రాబోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



