గబ్బర్ సింగ్ 2లో సీన్లు.. బెంగాల్ టైగర్‌లోకి..?
on Jun 20, 2015
.jpg)
పవన్ కల్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ 2 లో సీన్లు.. రవితేజ బెంగాల్ టైగర్‌లో వాడేస్తున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. గబ్బర్ సింగ్ 2 కోసం రెండేళ్లు వర్క్ చేశాడు సంపత్ నంది. ఆ సినిమా సంపత్ చేజారిపోయింది. ఆ తరవాత రవితేజను పట్టుకొని బెంగాల్ టైగర్ అనే సినిమా తీస్తున్నాడు. నిజానికి గబ్బర్ సింగ్ 2కి ఒక దశలో బెంగాల్ టైగర్ అనే పేరు పెడదామనుకొన్నారు.
పవన్ కోసం రాసుకొన్న ఆ కథనే టైటిల్ తో సహా వాడుకొని రవితేజతో సినిమా చేస్తున్నాడన్న ప్రచారం అప్పట్లోనే వచ్చింది. అయితే 'ఇది వవన్ కథ కాదు..' అని సంపత్ నంది కూడా కుండ బద్దలుకొట్టినట్టు చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన నిజం బయటపడింది.
గబ్బర్ సింగ్ 2 కోసం రాసుకొన్న రెండు యాక్షన్ సీక్వెన్స్‌ని రవితేజ సినిమా కోసం వాడుకొన్నామని స్వయంగా సంపత్ నందినే క్లారిటీ ఇచ్చేశాడు. అయితే కథ మాత్రం అది కాదని, రవితేజ కోసం ప్రత్యేకంగా రాసుకొన్న స్టోరీ ఇదని, అయితే బెంగాల్ టైగర్ టైటిల్ పెట్టడానికి మాత్రం ఖుషీలో పవన్ డైలాగే స్ఫూర్తి అని సంతప్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



