క్రిష్ ఫ్రాంచైజీ లవర్స్ కి శుభవార్త!
on Feb 4, 2023
హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫ్రాంచైజీ క్రిష్. ఇటీవల తన ప్రేయసితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా సినిమా క్రిష్ 4. ఇండియన్ ఫ్రాంచైజీలో క్రిష్ సిరీస్ కి అద్భుతమైన ఆదరణ ఉంది. ఈ సినిమా ఫోర్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అద్భుతమైన అనౌన్స్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇటీవల ఆ చిత్రం దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్ క్రిష్ ఫోర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశారు. హృతిక్ రోషన్ నటిస్తున్న క్రిష్ ఫోర్ గురించి రాకేష్ రోషన్ చెబుతూ ``త్వరలోనే క్రిష్ ఫోర్ ని అనౌన్స్ చేస్తాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం కోసం మేము కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. దానిమీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నాం`` అని అన్నారు.
క్రిష్ 4 గురించి ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. `` మీతో పాటు నేను కూడా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. మనందరం కలిసి మనసారా వేడుకుంటే త్వరగానే క్రిష్ 4 కల నెరవేరుతుందేమో`` అని అన్నారు. క్రిష్ 4కి చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా అతి త్వరలో ఓవర్‌కమ్ చేసి క్రిష్ ఫోర్ని పైప్ లైన్ లోకి తీసుకురావడానికి మేకర్స్ కృషి చేస్తున్నారని అప్పట్లో హింట్ ఇచ్చారు హృతిక్.. ఈ సినిమాలో జాడుస్ రిటన్ పాసిబిలిటీ కూడా ఉందని అన్నారు. ఒక అబద్ధం చెప్పండి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పండి అని ఈమధ్య హృతిక్‌ని విలేకరులు అడిగినప్పుడు ``క్రిష్ లూసెస్.. జూడూస్ రిటర్న్స్`` అంటూ సమాధానం ఇచ్చారు. ఈ సిరీస్‌లో మొదటి సినిమా కోయి మిల్ గయా 2003లో రిలీజ్ అయింది. ఆ తర్వాత క్రిష్‌ని 2006లో విడుదల చేశారు. క్రిష్ 3... 2013లో రిలీజ్ అయింది.క్రిష్ 4 కాకుండా హృతిక్ చేతిలో ఫైటర్ ఉంది ఫైటర్ లో దీపిక పదుకోన్ నాయికగా నటిస్తున్నారు. 2024 జనవరిలో ఫైటర్ విడుదల కానుంది.