పుంజుకున్న 'గాడ్ ఫాదర్'.. అయినా బ్రేక్ ఈవెన్ కష్టమే!
on Oct 9, 2022

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' నాలుగో రోజు శనివారం కావడంతో కాస్త పుంజుకుంది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.7.01 కోట్ల షేర్ రాబట్టగా, నాలుగో రోజు రూ.8.07 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఇక ఈరోజు(ఆదివారం) 'గాడ్ ఫాదర్'కి చాలా కీలకం. నాలుగో రోజుని మించిన షేర్ రాబట్టాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ కి చేరువ దిశగా అడుగులు పడతాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.70.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'గాడ్ ఫాదర్' మొదటి రోజు రూ.12.97 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా రెండో రోజు రూ.7.73 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.41 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.5.62 కోట్ల షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.9.28 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.7.35 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.15.10 కోట్ల షేర్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగు రోజుల్లో రూ.31.73 కోట్ల షేర్ సాధించిందని అంచనా. అలాగే కర్ణాటకలో 3.15 కోట్ల షేర్, హిందీ+రెస్టాఫ్ ఇండియా 3.75 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 3.80 కోట్ల షేర్ కలిపి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 42.43 కోట్ల షేర్(77.20 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు తెలుస్తోంది.
ఈరోజు ఆదివారం కావడంతో మరో రూ.8-10 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశముంది. అంటే ఐదు రోజుల్లో సుమారుగా రూ.50 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందన్నమాట. అయితే వరల్డ్ వైడ్ గా రూ.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఈ జోరు సరిపోదు. నేటితో దసరా సెలవులు కూడా ముగుస్తున్నాయి. సోమవారం నుంచి గాడ్ ఫాదర్ కి అసలు పరీక్ష ఎదురు కానుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లకు గండికొట్టే సినిమాలు లేకపోవడం మాత్రమే 'గాడ్ ఫాదర్'కి కలిసొచ్చే అంశం. మరి సోమవారం నుంచి మరో రూ.40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఈ చిత్రం మెగాస్టార్ కి హిట్ అందిస్తుందో లేక బయ్యర్లకు నష్టాలను మిగుల్చుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



