విశ్వక్ సేన్ మూవీ వాయిదా.. నిర్మాత పవన్ ప్రచారంలో ఉన్నాడు
on May 9, 2024
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీపై విశ్వక్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్ కూడా అదిరిపోవడంతో మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మే 17 న రిలీజ్ అని ప్రకటించడంతో టికెట్స్ బుక్ చేసుకునే మూడ్ లో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మూవీ ఆ డేట్ కి కూడా రావడం లేదు
వాస్తవానికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గత ఏడాదే విడుదల అవ్వాలి. కానీ సినిమా ఖ్వాలిటీ లో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాణం జరుపుకుంది. కొన్ని రోజుల క్రితం మే 17 న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్ మారింది మే 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.ఈ విషయాన్నీ ఒక పోస్టర్ ద్వారా తెలియచేసారు. మూవీ కంటెంట్ చాలా బాగుంటుందని, వాయిదా పడటంతో సినిమాకి వచ్చిన నష్టమేమి లేదని అంటున్నారు. విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలబడుతుందని చెప్తున్నారు
డి జె టిల్లు భామ నేహ శెట్టి హీరోయిన్ గా చేస్తుండగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ఒక కీలక పాత్రలో నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకుడు కాగా యువన్ శంకర రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. నాజర్ ,సాయి కుమార్ లాంటి సీనియర్ నటులు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో పవన్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడు