ENGLISH | TELUGU  

గాంధీ టాక్స్ మూవీ రివ్యూ 

on Jan 30, 2026

 

 

మూవీ పేరు: గాంధీ టాక్స్ 
న‌టీన‌టులు: విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ, మహేష్ మంజ్రేకర్, సిద్దార్ధ్ జాదవ్, జరీనా వహబ్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: కరణ్ బి రావత్ 
ఎడిట‌ర్‌: ఆశిష్    
మ్యూజిక్: ఏ ఆర్ రెహ్మాన్     
నిర్మాత‌లు:  కిషోర్ పాండురంగ్ బెలేకర్ ,రాజేష్ కేజ్రీవాల్, ఉమేష్ కుమార్ బన్సాల్
బ్యానర్స్: జీ స్టూడియోస్, కైరస్, మూవీ మిల్ 
రచన, ద‌ర్శ‌క‌త్వం: కిషోర్ పాండురంగ్ బెలేకర్ 
రిలీజ్ డేట్ : జనవరి 30  ,2025 

 

సెల్యులాయిడ్ పై చాలా సంవత్సరాల తర్వాత డైలాగ్స్ అనేవి లేకుండా కథ, కథనాలు,  ఆర్టిస్ట్స్ పెర్ ఫార్మెన్స్, మేకింగ్ పై నమ్మకంతో సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్'(Gandhi Talks)ఈ రోజు థియేటర్స్ లో అడుగుపుట్టింది. మరి మేకర్స్ తమ టార్గెట్ ని రీచ్ అయ్యారా లేదో చూద్దాం.


కథ

గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన మహాదేవ్((విజయ్ సేతుపతి)అత్యంత పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అనారోగ్యానికి గురైన తల్లితో కలిసి గొప్ప వాళ్ళ ఇళ్లల్లో వాష్ రూమ్ అంత కూడా ఉండని ఇంట్లో ఉంటుంటాడు. అదే ఏరియాలో ఉండే మధ్య తరగతి అమ్మాయి లయర్(అదితి రావు హైదరీ),మహాదేవ్ ఒకరికొకరు ప్రేమించుకుంటారు. బోస్ మాన్(అరవింద్ స్వామి) పేరుమోసిన కన్ స్రక్షన్ కంపెనీ అధినేతతో పాటు బడా కోటీశ్వరుడు.సెంట్రల్ గవర్నమెంట్ బోస్ మాన్ కంపెనీ ని స్వాధీనం చేసుకుంటుంది. దీంతో బోస్ మాన్ తన ప్రాపర్టీ ని చాలా వరకు కోల్పోవాల్సి రావడంతో ఒక నిర్ణయం తీసుకుంటాడు. బోస్ మాన్ ఇంట్లో మహాదేవ్ దొంగతనం చెయ్యాలని ఫిక్స్ అవుతాడు. ఒక వీధి దొంగ(సిద్దార్ధ్ జాదవ్) కూడా దొంగతనం కోసం బోస్ మాన్ ఇంటికి వెళ్తాడు. మరి ఆ ఇద్దరు వెళ్ళాక ఏం జరిగింది? బోస్ మాన్ ఆస్తులని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు స్వాధీనం చేసుకుంది? అందుకు దారితీసిన పరిస్థితి ఏంటి? మహాదేవ్,లయర్ ప్రేమ ఏమైంది?  బోస్ మాన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? మహాదేవ్ ఎందుకు దొంగతనానికి వచ్చాడు. మరి మహాదేవ్ ని బోస్ మాన్ చూసాడా? చూస్తే ఏం చేసాడు?  అసలు ఈ కథ కి గాంధీ టాక్స్ అనే టైటిల్ కి సంబంధం ఏంటనేదే చిత్ర కథ.

 

ఎనాలసిస్ 

ఇలాంటి చిత్రాన్నిసెల్యులాయిడ్ పైకి తీసుకొచ్చినందుకు మేకర్స్ కి, నటించిన నటులకి హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ భూమ్మీద మనుషులమైన మనం మాట్లాడుతున్నామని అనుకుంటాం. కానీ మాట్లాడించేది డబ్బు. ఆ డబ్బే మంచి, చెడు తో పాటు మనిషి సంతోషాలని, బాధలని డిసైడ్ చేస్తున్నాయని చెప్పారు. నటీనటులు కూడా అందుకు తగ్గట్టే తమ క్యారెక్టర్స్ లో సినిమాకి జీవం పోశారు. కాకపోతే ఇలాంటి కథలని ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చెప్తే బాగుండేదేమో. కథలో ఆ అవకాశం ఉండి కూడా మేకర్స్ ఆ దిశగా ఆలోచించలేదు.

 

ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా ప్రారంభం నుంచి వచ్చిన సన్నివేశంతోనే కథలోకి లీనమవుతాం. కాబట్టి డబ్బు లేని వాడిగా మహాదేవ్ ఎదుర్కునే    ఇబ్బందులని ఎక్కువగా చూపించాల్సింది. కానీ సో సో సీన్స్ తో  ముగించారు. ఉద్యోగాల కోసం వెతుకులాట విషయంలో కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవ్వాల్సింది. కాకపోతే  మహాదేవ్ , లయర్ మధ్య వచ్చిన  లవ్ సీన్స్ బాగున్నాయి. పెళ్లి చూపుల సీన్ అయితే ఎక్స్ లెంట్. బోస్ మాన్ తో వచ్చిన కోర్ట్ సీన్ తో క్యూరియాసిటీ వచ్చినా సదరు మోడ్ ని అంతటితోనే వదిలేసారు. ఆ తర్వాత బోస్ మాన్ పై వచ్చిన సీన్స్ బాగున్నాయి. కానీ బోస్ మాన్ ని తన టార్గెట్ గా మహాదేవ్ ఎంచుకునే ప్రాసెస్ లో  క్యూరియాసిటీ ని తెప్పించాలి. అలా కాకుండా నార్మల్ గా చూపించారు. ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.  

 

సెకండ్ ఆఫ్ మొత్తం బోస్ మాన్ ఇంట్లోనే జరుగుతుంది. దీంతో సన్నివేశాల్లో ఎంతో బలం ఉండాలి. కానీ సిల్లీగా ముగించారు. భావోద్వేగం అనేది మిస్ అయ్యింది. బోస్ మాన్, మహాదేవ్ మధ్య ఏం జరుగుతుందనే  క్యూరియాసిటీ ని ఎందుకు క్రియేట్ చెయ్యలేదో అర్ధం  కాదు. డబ్బు కోసం ట్రై చేసే సీన్స్ ని మరిన్ని చూపించాల్సింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నా మహాదేవ్ నే కన్విన్స్ అయ్యి బోస్ మాన్ ని సేవ్ చెయ్యాలని చూసి, ఆ తర్వాత బోస్ మాన్ ఇచ్చిన షాక్ తో మూవీ ఎండ్ చెయ్యాల్సింది.

 

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

మహాదేవ్ గా విజయ్ సేతుపతి(Vijay Sethupathi)పెర్ ఫార్మ్ ఒక రేంజ్ లో సాగింది. తల్లిపై ప్రేమని పెంచుకొని, ఆమె కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకునే వ్యక్తిగా, రాంగ్ రూట్ లో డబ్బు సంపాదించడం కంటే ఆత్మాభిమానంతో వీధులు ఊడ్చుకోని అయినా బతకచ్ఛనే క్యారక్టర్ లో సూపర్ గా చేసాడు. బోస్ మాన్ గా అరవింద్ స్వామి(Aravind Swamy)నట విశ్వరూపం గురించి ఎంత చెప్పుకున్నాతక్కువే. వ్యాపారంలో, జీవితంలో మనుషుల వల్ల మోసపోతే ఒక బడా మిలినియర్  బిహేవియర్ ఎలా ఉంటుందో అలాగే చేసాడు. నవ్వే విధానంలో కూడా సదరు క్యారక్టర్ తీరు తెన్నులు కనిపించాయంటే బోస్ మాన్ క్యారక్టర్ కి ఎంత జీవాన్ని పోసాడో తెలుసుకోవచ్చు. మిగతా క్యారక్టర్ లలో చేసిన అదితి రావు, మహేష్ మంజ్రేకర్, సిద్దార్ధ్ జాదవ్, విజయ్ సేతుపతి తల్లిగా చేసిన నటి తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేసారు. లెజండ్రీ నటీమణి జరీనా వహబ్ ని పెద్దగా ఉపయోగించుకోలేదు. కిషోర్ పాండురంగ్ బెలేకర్(Kishor Pandurang Belekar)దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు గాని , రచయిత గా అంతగా సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. డబ్బు కోసం చేసే పోరాటం వల్ల ఒక మనిషి తీసుకునే నిర్ణయం ఎదుటి వ్యక్తి  జీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేది ప్రధాన కాన్సెప్ట్. అందుకు తగ్గ్గట్టుగా సీన్స్ ని సృష్టించాల్సింది పోయి రెండు క్యారెక్టర్స్ పైనే ప్రధానంగా వెళ్ళాడు. ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)సాంగ్స్, బ్యాక్  గ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్. అతి పెద్ద ప్లస్ కూడా. ఫొటోగ్రఫీ కూడా అంతే. ముంబై లో సదరు క్యారెక్టర్స్ పక్కనే ఉండి చూస్తున్నట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఫైనల్ గా చెప్పాలంటే డైలాగ్స్ లేకపోయినా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి తమ పెర్ ఫార్మెన్స్ తో  మెప్పించారు. రెహ్మాన్ తో పాటు  కరణ్ ఫొటోగ్రఫీ కూడా అదనపు బలం. కాకపోతే  కథనాలు నడిచే విధానంలో లోపాలు ఉన్నాయి. బోర్ అయితే కొట్టదు.


రేటింగ్ 2 /5                                                                                        అరుణాచలం 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.