హరిత దర్శకత్వంలో బాలయ్య హీరోయిన్ సినిమా ప్రారంభం
on Jan 17, 2024

కాంచన, రూలర్ మూవీల్లో ఒన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన నటి వేదిక. ఈ సినిమాలకి ముందు కూడా ఆమె గతంలో కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులని తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె ఫియర్ అనే మూవీలో నటిస్తుంది. తాజాగా ఆ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రముఖ సీనియర్ నటులు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ ని అందించగా డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ ని ఇచ్చాడు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరోయిన్ వేదిక మాట్లాడుతు ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను ఈ మూవీలో నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది. డైరెక్టర్ హరిత గోగినేని ఈ కథ నాకు చెప్పినప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యాను. స్టోరీ తో పాటు మూవీలోని అన్ని క్యారెక్టర్ ల డిజైన్ లో హరిత గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అలాగే దత్తాత్రేయ మీడియా సంస్థలో పనిచేయడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పడంతో పాటు మంచి టెక్నీషియన్స్ తో మూవీని చేస్తున్నామని తప్పకుండా అందరికీ నచ్చుతుందని కూడా వేదిక చెప్పింది.

దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఫియర్ లో వేదిక తో పాటు ప్రముఖ హీరో అరవింద్ కృష్ణ ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు. వీరితో పాటు జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని లాంటి భారీ తారాగణం కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్, సంగీతాన్ని అందిస్తుండగా ఎన్నో భారీ హిట్ చిత్రాల సినిమాటోగ్రఫర్ ఐ ఆండ్రూ కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



