సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటుకు సన్నాహాలు
on Nov 17, 2022

సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలను పదిలంగా ఉంచడంతో పాటు ఆయన గొప్పతనం గురించి ముందు తరాలకు కూడా తెలిసేలా చేయడం కోసం కృష్ణ కుటుంబసభ్యులు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ మెమోరియల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 350కి పైగా చిత్రాలలో నటించిన కృష్ణ తెలుగు సినిమాకు విభిన్న జోనర్లను, సాంకేతికతను పరిచయం చేశారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ స్టార్ కృష్ణ. ఆయన సినీ ప్రయాణం ఎందరికో ఆదర్శం. తెలిసిన వారికి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, కొత్త తరాలకు ఆయన గొప్పతనం తెలిసేలా కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
కృష్ణ మెమోరియల్ లో ఆయన కాంస్య విగ్రహంతో పాటు ఆయన సినిమాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉండేలా ఏర్పాటు చేయాలని చూస్తున్నారట. ఆయన సాధించిన ఘనతలు, గెలుచుకున్న అవార్డులు, తెలుగు సినీ చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిన ఆయన సినిమాల పోస్టర్లు ఇలా పూర్తి ప్రణాళికతో కృష్ణ మెమోరియల్ ను అద్భుతంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



