మాట నిలబెట్టుకున్న 'ఎఫ్-3' టీమ్
on Jul 3, 2022
కొంతకాలంగా జయాపజయాలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని సినిమాలు మూడు నాలుగు వారాలకే ఓటీటీలో విడుదలవుతున్నాయి. అసలే టికెట్ ధరలతో థియేటర్ కి రావాలంటే ఆలోచిస్తున్న ఆడియన్స్.. ఎలాగూ కొద్దిరోజులకే ఓటీటీలోకి వస్తుంది కదా అని మరింత వెనకడుగు వేస్తున్నారు. దీంతో థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతల మండలి నిర్ణయిచింది. ఇదిలా ఉంటే 'ఎఫ్-3' మూవీ టీమ్ ఓటీటీలో విడుదల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.
ప్రస్తుతం సాధారణ టికెట్ ధరలతోనే తమ సినిమా విడుదలవుతుంది, ఓటీటీలోకి ఆలస్యంగా వస్తుందంటూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మే 27న విడుదలైన ఎఫ్-3 పరిస్థితి కూడా అంతే. 'ఎఫ్-3'కి థియేటర్స్ లో 'ఎఫ్-2' స్థాయి రెస్పాన్స్ రాకపోవడంతో.. తమ సినిమాని 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేస్తామని, థియేటర్స్ లో అందరూ చూసి ఆదరించాలని మూవీ టీమ్ కోరింది. చెప్పినట్లుగానే 8 వారాల తర్వాతే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'ఎఫ్-3' మూవీ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో జులై 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. మరి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
