డీజే ఆడియో లాంఛ్‌లో కంటతడి పెట్టిన అల్లు అర్జున్
on Jun 11, 2017

ఎప్పుడు ఏ ఈవెంట్‌కు వెళ్లినా..అక్కడ ఫుల్ జోష్ తీసుకువస్తారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. అలాంటి బన్నీ తన సినిమా ఆడియో లాంఛ్ వేడుకలో కంటతడి పెట్టారు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో అర్జున్ నటించిన డీజే ఆడియో లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్భంగా స్టైలీష్ అల్లు అర్జున్ మాట్లాడుతూ దిల్‌రాజు భార్య అనితను తలచుకున్నారు. ఈ సినిమా ఒకరి గురించి ఆడాలని తాను ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వారు ఎవరో కాదు అనితా ఆంటీ..ఆవిడ చనిపోయినప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుందా..? అనుకున్న టైంకి రిలీజ్ చేయగలమా అని తామంతా భావించామని కానీ రాజు గారు అంత బాధను ఒర్చుకుని డీజే కోసం శ్రమించారన్నారు. ఈ సమయంలో ఉద్వేగానికి లోనైన బన్నీ కంటతడి పెట్టారు. ఆ సమయంలో ఆడిటోరియం మొత్తం నిశ్శబ్ధంతో నిండిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



