'NTR 30' సంగతేమో గానీ 'NTR 31'పై క్లారిటీ వచ్చేసింది!
on Aug 16, 2022

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కావాల్సిన 'NTR 30' ఆలస్యమవుతూ వస్తోంది. ఈ అక్టోబర్ కి పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు. 'NTR 30' విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు కానీ.. అప్పుడే 'NTR 31' షూటింగ్ గురించి క్లారిటీ వచ్చేసింది.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రశాంత్ 'NTR 31'పై స్పందించాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో ప్రారంభం కానుందని తెలిపాడు. అంటే ఓ వైపు 'సలార్' షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగానే.. మరోవైపు 'NTR 31'ని పట్టాలెక్కించనున్నాడన్నమాట.
కాగా 'సలార్' షూటింగ్ ని కూడా ప్రశాంత్ ఇలాగే స్టార్ట్ చేశాడు. 'కేజీఎఫ్-2' షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో 'సలార్' షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పుడు 'NTR 31'ని కూడా 'సలార్' విడుదలకు ముందే మొదలు పెట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ లోపు 'NTR 30' మొదలై షూటింగ్ పూర్తి చేసుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



