బాలీవుడ్ దర్శకుడిపై పాక్‌లో బూటుతో దాడి..!
on Apr 27, 2016

భజరంగీ భాయిజాన్ సినిమా ద్వారా ఫేమస్ అయిన బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్‌కు పాక్‌లోని కరాచీలో చేదు అనుభవం ఎదురైంది. కరాచీ నుంచి లాహోర్ వెళ్లేందుకు ఆయన ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ను గుర్తుపట్టిన కొందరు పాకిస్థానీయులు కబీర్‌కు వ్యతిరేకంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్‌లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు. ఒక వ్యక్తి ఏకంగా బూటు పట్టుకుని ఆవేశంతో ఊగిపోతూ కబీర్ వెంటపడ్డాడు. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ఇండియా కుట్రలు చేస్తోందని, దీనిని సహించబోమని హెచ్చరించాడు. కబీర్ తీసిన పాంటమ్ సినిమా పాక్‌లో వివాదాస్పదమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



