ప్రతాపరుద్రుడుకి దిల్ రాజు సపోర్ట్
on Oct 14, 2015
.jpg)
రుద్రమదేవి సినిమా సక్సెస్ కావడంతో ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆ సినిమా టీమ్ ముందుకొచ్చింది. ఈ సక్సెస్ మీట్ దిల్ రాజు గుణ శేఖర్ కి ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. ''హిస్టారికల్ ఫిలిం ఈ జనరేషన్ వాళ్లకు ఎలా నచ్చుతుందో.. అనుకున్నాను. కాని కేవలం మౌత్ టాక్ తో బిగ్గెస్ట్ హిట్ చేసారు. డిస్ట్రిబ్యూటర్ గా ఈ టీం తో ట్రావెల్ అవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నాను. గుణశేఖర్ గారికి మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఈ సినిమా ఇంకా గొప్పగా ఉండేది. ఆయన రుద్రమదేవి కి కంటిన్యూస్ గా ప్రతాపరుద్రుడు సినిమా చేయాలనుకుంటున్నారు. ఆయన కథ సిద్ధం చేస్తే నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాను''.. అని చెప్పారు. ఆ టైమ్ లో ఎంతో ఎమోషన్ అయిన గుణశేఖర్ నేరుగా దిల్ రాజుని ఉద్ధేశిస్తూ... నా కొత్త సినిమాకి నిర్మాత దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



