రుద్రమదేవి కష్టం 3 సంవత్సరాలు..గోనగన్నారెడ్డిది 30 రోజులు
on Oct 14, 2015
.jpg)
రుద్రమదేవి సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఓ మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో రుద్రమదేవి చరిత్రను తెరకెక్కించారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడానికి 3డి లో షూట్ చేసారు. విమెన్ ను సపోర్ట్ చేస్తూ.. సినిమా చేయడమనేది గొప్ప విషయం. ఈ సినిమాకు హీరో అనుష్కనే. నేను కష్టపడింది కేవలం 30 రోజులు మాత్రమే కాని అనుష్క మాత్రం మూడు సంవత్సరాలుగా ఎంత కష్టపడి చేసిందో మాటల్లో చెప్పలేను. ఆ డెడికేషన్, మంచితనం అనుష్కకు తప్ప మరొకరికి లేదు. పెర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని సినిమాకు మొదట సపోర్ట్ చేసిన వ్యక్తి ఇళయరాజా గారే. ఆర్టిస్టులలో ప్రకాష్ రాజు గారు, రానా, ఎంతగానో సపోర్ట్ చేసారు. రానా సంవత్సరంన్నర గా బాహుబలి సినిమాలో నటిస్తూ.. ఈ సినిమా కోసం కూడా కష్టపడ్డాడు. ఈ సినిమాలో నేను నటించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.. అని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



