వకీల్ సాబ్.. `దిల్` రాజు ఏప్రిల్ సెంటిమెంట్!
on Apr 5, 2021
ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మించిన చిత్రాల్లో సింహభాగం విజయం సాధించాయి. మరీ ముఖ్యంగా.. సమ్మర్ సీజన్ లో తన నుంచి వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఇంకా చెప్పాలంటే.. నిర్మాతగా `దిల్` రాజు ప్రయాణం మొదలైందే వేసవి సీజన్ లో. ఆయన నిర్మించిన తొలి చిత్రం `దిల్` సరిగ్గా పద్దెనిమిదేళ్ళ క్రితం సమ్మర్ స్పెషల్ గా ఇదే ఏప్రిల్ 5న థియేటర్స్ లో సందడి చేసింది. టికెట్ విండోస్ దగ్గర కాసులజల్లు కురిపించింది. ఆ తరువాత రాజు నిర్మించిన పలు సినిమాలు వేసవిలో వినోదాలు పంచాయి.
కట్ చేస్తే.. ఇప్పుడదే సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్` రిలీజ్ కానుంది. పవన్ తో రాజు నిర్మించిన తొలి చిత్రమిదే కావడం విశేషం. కాగా.. ఏప్రిల్ నెలలో `దిల్` రాజు నిర్మాణంలో వచ్చిన `దిల్` (2003), `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011) వంటి తెలుగు సినిమాలు సక్సెస్ సాధించాయి. మరి.. ఏప్రిల్ సెంటిమెంట్ రిపీట్ అయి ఈ నెల 9న రాబోతున్న `వకీల్ సాబ్` కూడా అదే బాట పట్టి రాజుకి `ఏప్రిల్ హ్యాట్రిక్`ని అందిస్తుందేమో చూడాలి.