ఆకట్టుకుంటున్న 'సార్' ఫస్ట్ లుక్
on Jul 27, 2022

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం 'సార్'(తమిళ్ లో 'వాతి'). తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
రేపు(జులై 28) ధనుష్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఒక రోజు ముందే తెరతీస్తూ 'సార్' ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్. పోస్టర్ లో ధనుష్ ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా, దీక్షగా రాసుకుంటున్నట్లు కనిపిస్తున్నాడు. మరి ఈ 'సార్'.. స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడో లేక ఎవరికైనా గుణపాఠాలు చెప్పడానికి సిద్ధమవుతున్నాడో చూడాలి. అలాగే ధనుష్ పుట్టినరోజు నాడు అనగా రేపు సాయంత్రం 6 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు పోస్టర్ లో తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ...'సార్' చిత్రంలో ధనుష్ లెక్చరర్ గా కనిపిస్తారు. విద్యా వ్యవస్థ నేపధ్యంలో జరిగే కథ. నేడు విడుదలైన ఫస్ట్ లుక్ కానీ, రేపు మా హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న టీజర్ కానీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో రూపొందుతోంది చిత్రం. ధనుష్ సహకారం, ఆయనతో ప్రయాణం మర్చిపోలేనిది అన్నారు. అలాగే జీవీ ప్రకాష్ సంగీతం, యువరాజ్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరింత వన్నె తెస్తాయి అని నమ్ముతున్నాను అని తెలిపారు.
'సార్' అక్టోబర్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపారు నిర్మాత నాగవంశీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



