రాజమౌళి దెబ్బకి నష్టపోయిన కమెడియన్.. ఫోన్ చేసిన శ్రీముఖి
on Jul 11, 2024

బుల్లితెర మెగా షో జబర్దస్త్ నుంచి సినీ ఎంట్రీ ఇచ్చిన నటుడు ధన్‌రాజ్(dhanraj)స్క్రీన్ మీద తను కనపడగానే అరేయ్ ధనరాజ్ వచ్చాడు రా అనే స్థాయికి ఎదిగాడు.ఇటీవలే దర్శకుడు గా కూడా మారాడు. ఇక లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ధనరాజ్ తన సినీ కాల క్రమంలో నిర్మాతగా మారి ధనలక్ష్మీ తలుపు తడితే అనే సినిమాని నిర్మించాడు. హీరోయిన్ గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి ని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో జరిగిన కొన్ని విషయాల గురించే చెప్పాడు.. ధనలక్ష్మీ తలుపు తడితే కోసం ఇండస్ట్రీ లో సంపాదిచినదంతా ఖర్చు చేశాను. అప్పటికి డబ్బులు సరిపోకపోతే నా స్నేహితుల దగ్గర కూడా అప్పు చేశాను. ఇక ఆ తర్వాత ఎలాగోలా రిలీజ్ చేశాను. మూవీ చూసిన వాళ్ళందరు బాగుందని చెప్పారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. ఒక రోజు శ్రీముఖి ఫోన్ చేసి మన సినిమా బాగుందని, థియేటర్స్‌లో టికెట్స్ దొరకడం లేదని చెప్పింది. ఆ మాటలు విని చాలా సంతోష పడ్డాను. ఒక వారం రోజుల వరకు బాగానే ఆడింది. ఇక అంతా బాగుంది అనుకుంటున్న వేళ ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ ల బాహుబలి థియేటర్లలోకి అడుగుపెట్టింది. దీంతో ముందస్తు అగ్రిమెంట్ ఉండటం వల్ల నా సినిమాని వారానికే తీసేసారు. దాంతో భారీ నష్టాలు వచ్చాయని ధన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేసాడు.

ఇక ప్రస్తుతం తమిళ దర్శకుడు సముద్రఖనితో కలిసి రామం రాఘవం (ramam raghavam)సినిమాలో చేస్తున్నాడు. దర్శకుడు కూడా ధనరాజ్ నే. భీమిలి కబడ్డి జట్టు, పిల్ల జమీందార్, అత్తారింటికి దారేది, మడత కాజా, అలా మొదలైంది, గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల, రాజుగారి గది, ఎక్స్‌ప్రెస్ రాజా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, భాగమతి, కథనం, ఓ బేబీ వంటి సినిమాలు నటుడుగా ధన్‌రాజ్ కి మంచి పేరు తీసుకొచ్చాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



