దేవిశ్రీ ప్రసాద్ ప్రేమలో పడ్డాడట!!
on Nov 22, 2018

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకడు దేవిశ్రీప్రసాద్ ఒకడు. అయితే ఇటీవల ప్రేమలో పడ్డాడంటూ కోలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, గతంలో ఛార్మితో దేవిశ్రీప్రసాద్ ప్రేమలో పడ్డాడంటూ , పెళ్లి చేసుకోబుతున్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమవ్వలేదు. ఇంతకీ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఎవరి ప్రేమలో పడ్డాడు? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.... సుకుమార్ దర్శకత్వం వహించిన `రంగస్థలం` చిత్రంలో ఆది పినిసెట్టి లవర్ గా నటించిన పూజాత పొన్నాడ ప్రేమలో దేవిశ్రీప్రసాద్ పడ్డాడట. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారనీ, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. నిజంగానే వీరిద్దరూ లవ్ లో పడ్డారా? లేదా గతంలో మాదిరిగానే వార్తలు వస్తున్నాయన్నది తెలియాల్సి ఉంది. వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ నిజం ఏంటో బయటకు రాదు. సో వెయిట్ అండ్ సి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



