సిక్స్ ప్యాక్ అఖిల్ !!!
on Nov 22, 2018
అక్కినేని అఖిల్ నటిస్తోన్న మూడవ చిత్రం `మిస్టర్ మజ్ను`. ఇప్పటి వరకు విజయవంతంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ తీసుకుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రంలో ని హీరో ఇంటడ్రక్షన్ సాంగ్ లో అఖిల్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సిక్స్ ప్యాక్ కోసం అఖిల్ ఇటీవల చాలా రోజులు వర్కవుట్స్ చేసాడట. ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నారట. సినిమాకే హైలెట్ గా నిలిచే ఈ పాటను చాలా గ్రాండ్ గా అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ పాత్రలో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా బివియస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి నెలాఖరులో విడుదల కానుందీ చిత్రం.