ఇన్నాళ్లకు పుష్ప శ్రీవల్లి పాట సీక్రెట్ ని బయటపెట్టిన దేవి శ్రీ ప్రసాద్
on Nov 23, 2023

కొన్ని వందల పాటలకి ట్యూన్స్ ని అందించి తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రెండు దశాబ్దాలకి పైగా రారాజుగా వెలుగొందుతున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కి స్టార్ డం ని తెచ్చిపెట్టిన వాళ్ళల్లో దేవి కూడా ఒకరు. తెలుగు వాళ్ళ ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాలలో దేవి కంపోజ్ చేసిన పాట మోత మోగిపోవడమనే ఆనవాయితీ కూడా ఎప్పటినుంచో వస్తుంది. ఇటీవలే నేషనల్ అవార్డు ని కూడా అందుకున్న దేవి తాజాగా ఒక పాట విషయంలో చెప్పిన సీక్రెట్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
పుష్ప సినిమా ఘన విజయంలో ఆ సినిమాలోని సాంగ్స్ కూడా ఒక కారణం అనే విషయం అందరు ఒప్పుకునే నిజం.మరి ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ అయితే ప్రపంచ దేశాల్లో ఉన్నసెలబ్రిటీ ల అందరి చేత వీడియోలు కూడా చేయించింది. ఈ శ్రీవల్లి సాంగ్ ని ట్యూన్ చెయ్యడానికి దేవికి కేవలం నాలుగు నిమిషాల సమయం మాత్రమే పట్టింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నాలుగు నిమిషాల ముప్పై సెకన్లు సమయంలో శ్రీవల్లి సాంగ్ ట్యూన్ అయిపోయింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో దేవి ఈ విషయం చెప్పాడు. లిరిక్ రైటర్ ఈ పాట రాయకముందే తన నోటితో శ్రీవల్లి అనే పేరుతో కాకుండా వేరే పేరుతో ట్యూన్ చేసుకుంటూ ఉండేవాడినని కూడా దేవి చెప్పాడు.
.webp)
ఇప్పుడు ఈ వార్తని సోషల్ మీడియాలో చూసిన వాళ్ళందరు దేవికి సంగీతం పట్ల ఉన్నకమిట్ మెంట్ చాలా గొప్పదని అనుకుంటున్నారు. అలాగే దేవి నాలుగు నిమిషాల్లో పూర్తి చేసిన శ్రీవల్లి సాంగ్ ఇంకో రెండు దశాబ్దాల వరకైనా తెలుగు వాళ్ళ మైండ్ నుంచి వెళ్లిపోదనేది నగ్న సత్యం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



