ఇక మాట్లాడుకోవడాలు లేవు.. ఎనీ డౌట్స్
on Jul 29, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)..ఈ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమకి లభించిన వరం. సిల్వర్ స్క్రీన్ పై కనపడితే చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని థియేటర్ కి రప్పించగలిగే మేరునగధీరులు. తమ ప్రీవియస్ చిత్రాలు 'దేవర'(Devara), 'హరిహర వీరమల్లు'(HariHara Veeramallu)తో మరోసారి తమ సత్తా చాటారు.
ఈ రెండు చిత్రాలకి సీక్వెల్స్ ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఈ రెండు చిత్రాల సీక్వెల్స్ ఉంటాయా లేదా అనే డౌట్ ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం 'ప్రశాంత్ నీల్' మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ జనవరి 9 న 'సంక్రాంతి' కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత 'త్రివిక్రమ్'(Trivikram)తో మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్(Prashanth Neel)మూవీ కంప్లీట్ అయిన తర్వాతే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడనే టాక్ ఉంది. పురాణాల నేపథ్యంలో తెరకెక్కే సబ్జెట్ కావడంతో చాలా టైం పడుతుందనేది కూడా వాస్తవం. ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనపడినప్పుడు, చేతిలో పురాణాలకి సంబంధించిన బుక్ తో కనపడ్డాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ ఇప్పట్నుంచే త్రివిక్రమ్ మూవీ కోసం ఎంతలా ప్రిపేర్ అవుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి 'సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిల్లో 'ఓజి' 'దసరా' కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్ డేట్' ఇంకా ఇవ్వకపోయినా 'సంక్రాంతికి' అనే టాక్ వినపడుతుంది. ఇటీవలే ఉస్తాద్ క్లైమాక్స్ సీన్ కంప్లీట్ అయ్యింది.
పవన్ ప్రస్తుతం రాజకీయపరంగా అధికారంలో ఉన్నాడు. ఓజి, ఉస్తాద్ లని పూర్తి చెయ్యాలని బిజీ పనులు సైతం పక్కన పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇవి పూర్తిగా కంప్లీట్ అయ్యాక, మళ్ళీ ప్రజా సేవలో బిజీ అవ్వడం ఖాయం. మరి వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన కథ. పార్ట్ 2 లో యుద్ధ సన్నివేశాలు కూడా భారీగా ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు. ఎన్టీఆర్ దేవర సైతం ఆషామాషీ సబ్జెట్ కాదు. భారీ తనంతో పాటు విజువల్ గా ఎన్నో ప్రమాణాలతో తెరకెక్కింది. దర్శకుడు కొరటాల శివ(Koratala Siva)చాలా సందర్భాల్లో మాట్లాడుతు 'దేవర పార్ట్ 1 'లో మీరు చూసింది గోరంత. పార్ట్ 2 లో కొండంత 'దేవర' ని చూస్తారనే రీతిలో చెప్పుకుంటు వస్తున్నాడు. దీంతో దేవర, వీరమల్లు ని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు పూర్తి చేస్తారు. బిజీ షెడ్యూల్స్ లో ఆ రెండు భారీ చిత్రాలని అసలు చెయ్యగలరా అనే సందేహాల్ని సోషల్ మీడియా వేదికగా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కానీ తమ అభిమాన హీరో ఒకసారి మాటిచ్చాడంటే వెనక్కి తగ్గడని, దేవర 2 , వీరమల్లు 2 ఉంటాయని పవన్, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎపుడు లేని విధంగా వీరమల్లు కి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొని వీరమల్లు 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. ఎన్టీఆర్ కూడా 'దేవర 2 'ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



