కాలి నడకన కొండమీదకి బాలీవుడ్ అగ్ర హీరోయిన్..కొండ మీద విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ
on Dec 15, 2023

ఎన్నో సినిమాల్లో తన అధ్బుతమైన నటనతో భారతీయ సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన నటీమణి దీపికా పదుకొనె. ఆమె తెలుగులో డైరెక్ట్ గా సినిమా చెయ్యకపోయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో కూడా దీపికా కి క్రేజ్ ఉంది.ప్రముఖ నటుడు రణబీర్ సింగ్ ని వివాహం చేసుకున్న దీపికా ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడ్ని దర్శించుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
దీపికా పదుకొనె ఈ రోజు అలిపిరి మెట్ల ద్వారా కాలి నడకన తిరుమల చేరుకొని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడిని విఐపి ప్రారంభ సమయంలో దర్శనం చేసుకుంది. అనంతరం ఆమెకి పండితులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలని అందచేశారు. దీపికా ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ చిత్రంలో నటిస్తుంది.ఆ సినిమా విజయంతం కావాలని వచ్చిందేమో అని అందరు అనుకుంటున్నారు. దీపికా తిరుమల పర్యటనకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీపికా ఇంతకు ముందు కూడా చాలా సార్లు తిరుమల వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంది.

అలాగే ఇటీవలే కొత్తగా పెళ్లి జరుపుకున్న ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు మనవడు ప్రముఖ హీరో అభిరామ్ దంపతులతో పాటు రామానాయుడు కొడుకు సురేష్ బాబు దంపతులు కూడా వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకొని స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు రంగనాయక మండపంలో వారందర్ని ఆశీర్వదించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలని అందచేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



