దాసరి నేషనల్ అవార్డ్స్.. ముఖ్య అతిథులుగా తెలుగు రాష్ట్రాల సీఎంలు!
on Mar 16, 2022

దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మే 4న దాసరి కల్చరల్ ట్రస్ట్, ఇమేజ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో నేషనల్ అవార్డ్స్ ను ప్రధానం చేయనున్నారు. దాసరి పేరిట నేషనల్ అవార్డ్స్ ను ఇస్తామని గతేడాది జులైలో ప్రకటించిన ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్.. ఆ మాట నిలబెట్టుకుంటూ, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ.. "నా గురువు, దైవం అయిన దాసరి పేరిట ప్రతి ఏటా ఫిల్మ్ అండ్ టీవీ నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించాము. పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషా చిత్రాల టెక్నిషియన్స్ కు దాసరి నేషనల్ అవార్డ్ లను ప్రధానం చేయబోతున్నాము. ఇందుకోసం ఇప్పటికే 'దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్' ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నాము. భారీ స్దాయిలో హైదరాబాదు లోనే జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము. వేదిక మరియు అవార్డు కమిటీకి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచేస్తాం" అన్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించి చాలా కాలమైంది. మరి ఈ దాసరి నేషనల్ అవార్డ్స్ వేదికపై ఇద్దరు కనువిందు చేస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



