దగ్గుబాటి హీరో డెబ్యూ మూవీ ప్రారంభం
on Jul 5, 2021

దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కొన్నాళ్లుగా న్యూస్ వినిపిస్తోంది. అయితే అభిరామ్ హీరోగా రూపొందే సినిమా ఎట్టకేలకు ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
అభిరామ్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ ఓ సినిమా రూపొందించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అభిరామ్ కూడా తేజ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇటీవల చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కింది. ఆదివారం రామానాయుడు స్టూడియోస్ లో అభిరామ్-తేజ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇదో విభిన్న ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ఈ మూవీకి 'అహింస' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై 'జెమిని' కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



