ఆగస్ట్‌లో డీజే టిల్లు సీక్వెల్ షురూ.. అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్
on Jun 27, 2022

'డీజే టిల్లు' మూవీ సూపర్ హిట్టయింది. ఈ మూవీ కోసం రూ. 8 కోట్లు ఖర్చుపెడితే రూ. 30 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఐతే ఇప్పుడు డీజే టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ ఫాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ వస్తోందని ఒరిజినల్ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్ చేశాడు. "The most awaited Franchise... Gearing up for Round 2.. Crazy adventure starts filming in August!" అంటూ ఆయన పోస్ట్ చేశాడు.
ఎన్నో ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధు 'డీజే టిల్లు' మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ ఐపోయాడు. ఈ మూవీ టైటిల్ సాంగ్ ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్ లో వుంది. పీడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని తీస్తున్నారు. ఈ సీక్వెల్ కి సిద్ధు కథను అందించాడు. ఇక టిల్లు ఇప్పుడిప్పుడే బిజీ ఐపోతున్నాడు.. ఇటీవలే రెండు ప్రాజెక్ట్స్ మీద సైన్ కూడా చేసాడట. టిల్లు మేకప్ , టిల్లు స్టైల్ ఇప్పుడు యూత్ లో మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. ఉంగరాల జుట్టు, ఇద్దరు మనుషులు పట్టేంత డ్రెస్సులు, కోతి డాన్సులు, నవ్వు తెప్పించే యాస.. ఇప్పుడు యూత్ ఇలాంటి మేకప్ తోనే ఫేమస్ అవుతున్నారు.
హీరో ఇలాగే ఉండాలి అనే ఫార్మాట్ ని తుడిచేసి కొత్త స్టైల్ ని క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసాడు టిల్లు. ఇక 'డీజే టిల్లు' సీక్వెల్ వస్తోంది అనేసరికి సిద్దు ఫాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఐతే 'టిల్లు 2'లో కూడా హాట్ నేహా ఉండాలని ఆశపడుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ సెకండ్ పార్ట్ లో సిద్ధు అలియాస్ టిల్లు ఎలాంటి డిఫరెంట్ స్టైల్ లో కనిపించబోతున్నాడు, ఎలాంటి యాస వాడబోతున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



