ఆర్జీవీ 'లడ్కీ'కి షాక్ ఇచ్చిన కోర్టు!
on Jul 18, 2022

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా తీస్తానని తన దగ్గర లక్షలాది రూపాయలు తీసుకొని, సినిమా తీయకపోగా, డబ్బు కూడా తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ నిర్మాత కోర్టుని ఆశ్రయించడంతో.. ఆర్జీవీ లేటెస్ట్ మూవీ 'లడ్కీ'(అమ్మాయి) ప్రదర్శనపై కోర్టు స్టే విధించింది.
'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే సినిమాను నిర్మించిన శేఖర్ రాజు దగ్గర సినిమా చేస్తానంటూ వర్మ లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడట. కానీ ఇంతవరకు సినిమా ఊసే ఎత్తడంలేదట. పోనీ డబ్బులైనా తిరిగి ఇవ్వమంటే దానికి కూడా సరైన సమాధానం చెప్పడంలేదట. దీంతో విసిగిపోయిన నిర్మాత శేఖర్ రాజు.. తన దగ్గర తీసుకున్న లక్షలాది డబ్బు తిరిగిచ్చే వరకు ఆర్జీవీ తెరకెక్కించిన 'లడ్కీ' సినిమాపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆధారాలతో కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు థియేటర్స్, ఓటీటీ సహా అన్ని రకాల ప్రదర్శనపై తాత్కాలిక స్టే విధించినట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల 'డేంజర్' మూవీ సమయంలోనూ ఆర్జీవీ తన దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ మరో నిర్మాత నట్టి కుమార్ కోర్టుని ఆశ్రయించి సినిమా విడుదలపై స్టే తీసుకొచ్చాడు. ఆ టైంలో వర్మ, నట్టి కుమార్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. కానీ కొద్ది రోజులకి వివాదం ముగిసిపోయి మళ్ళీ ఇద్దరూ దోస్త్ మేరా దోస్త్ అన్నారు. తాజాగా వివాదానికి కూడా అలాంటి శుభం కార్డు పడుతుందేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



