వెబ్ సిరీస్‌లో యాక్టరే రెండు ఎపిసోడ్స్‌ని డైరెక్ట్ చేశాడు!
on May 25, 2020

కమెడియన్ హర్షవర్ధన్ ఉన్నాడు కదా. ఆయన రైటర్ కూడానూ! నితిన్ 'ఇష్క్', 'గుండెజారి గల్లతయ్యిందే', అక్కినేని కుటుంబం నటించిన 'మనం' తదితర చిత్రాలకు రచయితగా పని చేశాడు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అని ఒక సినిమాకి డైరెక్షన్ చేశాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... అతడో వెబ్ సిరీస్‌లో రెండు ఎపిసోడ్స్‌ని డైరెక్ట్ చేశాడు. పదమూడేళ్ల క్రితం బుల్లితెర మీద నవ్వులు పంచి ప్రభంజనం సృష్టించిన 'అమృతం'కి సీక్వెల్ 'అమృతం ద్వితీయం'. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ గ్రూప్‌కి చెందిన డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్ జీ5లో వెబ్ సిరీస్ కింద వస్తుంది. ఉగాదికి స్టార్ట్ అయింది. ఇందులో రెండు ఎపిసోడ్స్‌ని హర్షవర్ధన్ డైరెక్ట్ చేశాడని ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ గుణ్ణం చెప్పారు.
ఉగాదికి 'అమృతం ద్వితీయం' స్టార్ట్ చేసినప్పుడు ప్రతినెలా మూడు ఎపిసోడ్స్ లైవ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, లాక్‌డౌన్ ఎఫెక్ట్ వల్ల కుదరలేదు. జూన్ 25 నుండి క్రమం తప్పకుండా చేస్తామని జీ 5 క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తీసిన రెండు స్పెషల్ ఎపిసోడ్స్ ను మే 27న లైవ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



