టాలీవుడ్ హీరో కుమార్తెకూ తప్పని వేధింపులు
on May 25, 2020

ఐశ్వర్య రాజేష్ పేరు చెబితే తమిళ చిత్ర పరిశ్రమ నుండి తెలుగులోకి వచ్చిన కథానాయికగా అని కొందరు భావిస్తారు. అది తప్పు. తను తెలుగమ్మాయే. తెలుగులో ఒకప్పుడు కథానాయకుడిగా సినిమాలు చేసిన రాజేష్ కుమార్తె. ఆమెకు హాస్యనటి శ్రీలక్ష్మి స్వయానా మేనత్త. తమిళంలో పాతిక దాకా సినిమాలు చేసిన తర్వాత తెలుగుకి రావడంతో చెన్నై సుందరి అనుకుంటారంతా. ఒకప్పటి టాలీవుడ్ హీరో కూతురికీ లైంగిక వేధింపులు తప్పలేదంటే నమ్ముతారా? ఆమె మాటల్లో అక్షరాలా సత్యం ఇది. ఐశ్వర్య రాజేష్‌కి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి... పదకొండు, పన్నెండేళ్ల వయసులో ఇద్దరు సోదరులు మరణించారు. కుటుంబ పోషణ కోసం కథానాయికగా మారాలని నిర్ణయించుకున్నారు.
అవకాశాల కోసం తిరిగే క్రమంలో విమర్శలు, ఛీత్కారాలు సహా లైంగిక వేధింపులూ ఎదుర్కొన్నానని తాజాగా ఐశ్యర్య రాజేష్ తెలిపారు. నార్త్ ఇండియన్ హీరోయిన్లులాగా డ్రస్సులు వేసుకోవడం లేదని, నల్లగా ఉన్నానని, తమిళం మాట్లాడానని తనకు అవకాశాలు ఇవ్వలేదని ఆమె చెప్పారు. కొందరు దర్శకులు కమెడియన్లను లవ్ చేసే రోల్స్ ఇస్తే చేయలేదని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని విమర్శించినా తనపై విశ్వాసం ఏనాడూ కోల్పోలేదని, అందువల్లే ఈస్థాయికి వచ్చానని, మహిళలు అందరూ ఇలాగే ఉండాలని ఐశ్వర్య రాజేష్ సూచించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



