కలర్స్ స్వాతి పెళ్లి డేట్ ఫిక్స్
on Aug 13, 2018

కలర్స్ టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన స్వాతి.. కలర్స్ స్వాతిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టాచెమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలతో వెండితెర మీద సందడి చేసిన స్వాతి, త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.. కొంత కాలంగా స్వాతి, మలేషియన్ ఎయిర్‌లైన్స్ లో పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.. ఇరు కుటుంబాల అంగీకారంతో, ఆగస్ట్ 30న హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటల సమయంలో వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది.. కాగా వివాహం తర్వాత స్వాతి తన భర్తతో కలిసి ఇండోనేషియాలో స్థిరపడనున్నట్టు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



