ఆర్‌ఎక్స్ 100 రీమేక్ లో ఆది..!!
on Aug 13, 2018
.jpg)
రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్‌ఎక్స్ 100' యూత్ ని బాగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది.. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.. త్వరలో ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆది తమిళ వెర్షన్‌లో హీరోగా నటించనున్నారు.. తెలుగులో హీరో,హీరోయిన్లుగా కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన విషయం తెలిసిందే.. తమిళ వెర్షన్‌లో హీరోగా ఆది చేస్తుండగా.. లిప్‌లాక్‌లతో సంచలనం సృష్టించిన పాయల్ రాజ్‌పుత్ స్థానంలో ఏ హీరోయిన్‌ను ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.. చూద్దాం మరి తెలుగు యువతను ఆకట్టుకున్న 'ఆర్‌ఎక్స్ 100 ' తమిళ యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



