హీరోతో షూటింగ్ చేయకుండానే టీజర్ ఎలా వదలాలో తెలుసా?
on Sep 25, 2023
చియాన్ విక్రమ్ చేసే సినిమాలకు అనుకోని అవాంతరాలు, అనవసరమైన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇది విక్రమ్‌కి బాగా అలవాటైపోయింది. గతంలో తమిళ్‌లో చేసిన ధృవనక్షత్రం, ఐ, ఇంకొక్కడు వంటి సినిమాలు షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. అలాంటి సమస్యలో విక్రమ్ మరో సినిమా ఉంది. అదే ‘సూర్యపుత్ర కర్ణ’. ఈ సినిమాను ఆరేళ్ళ క్రితమే అనౌన్స్ చేశారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. విక్రమ్‌కి సంబంధించి కొన్ని సీన్స్‌ను మాత్రమే చిత్రీకరించారు. అయితే ఈ ప్రొడక్షన్ బాగా డిలే అవుతుండడంతో విక్రమ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ సినిమా కోసం అనుకున్న డేట్స్‌ని పొన్నియన్ సెల్వన్‌కి ఇచ్చాడు.
ఇప్పుడు సడన్‌గా ‘సూర్య పుత్ర కర్ణ’ టీజర్‌ను విడుదల చేశాడు దర్శకుడు ఆర్‌ఎస్ విమల్. ఇది అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఎందుకంటే విక్రమ్ సంబంధించి ఒకటో, రెండో సీన్స్ తీశారు. ఆ తర్వాత విక్రమ్ ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొనలేదు. అయినా నిర్మాతలు ఎంతో ధైర్యంగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను రిలీజ్ చేసి అందరి దగ్గరా అడ్వాన్సులు రాబట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారని తమిళ సినీవర్గాలు, మీడియా అంటున్నాయి. ఈ టీజర్ చూసిన తర్వాతైనా విక్రమ్ మళ్ళీ ఈ సినిమా కోసం డేట్స్ కేటాయిస్తాడని అలా చేసి ఉంటారని మరొక వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా హీరోతో షూటింగ్ చేయకుండానే విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై చియాన్ విక్రమ్ స్పందించలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



