మెగా ఫెస్టివల్.. ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరు, సల్మాన్ డ్యాన్స్!
on Jul 29, 2022

మెగాస్టార్ చిరంజీవి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది డ్యాన్స్. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయనలో గ్రేస్ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు. ఇటీవల 'ఆచార్య' సినిమాలో తనయుడు రామ్ చరణ్ తో కలిసి పోటాపోటీగా చిందేసి అలరించిన ఆయన.. ఈసారి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేసి కనువిందు చేయనున్నారు.
చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ షేర్ చేశారు చిరంజీవి. ఈ సినిమాలో తాను సల్మాన్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్నానని, దానికి ప్రభుదేవా అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడని, కన్నుల పండుగ ఉంటుందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



