Home

»

Latest News

 `బంగార్రాజు`.. హ్యాట్రిక్స్ ఎన్నో!

Jan 18, 2022 10:39AM

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన విలేజ్ డ్రామా `బంగార్రాజు` పొంగ‌ల్ విన్న‌ర్ గా నిలిచింది. ఫ‌స్ట్ వీకెండ్ లో ఓపెనింగ్స్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. అన్నీ అనుకూలిస్తే అటు కింగ్ నాగార్జున‌, ఇటు యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కి కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ కావ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఒక్క `బంగార్రాజు`తో ప‌లు హ్యాట్రిక్స్ న‌మోద‌వ్వ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది.  ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఉప్పెన‌`, `శ్యామ్ సింగ రాయ్` త‌రువాత చిత్ర క‌థానాయిక కృతి శెట్టికి `బంగార్రాజు` హ్యాట్రిక్ మూవీ కాగా.. `మ‌నం` `ప్రేమ‌మ్` అనంత‌రం నాగ్ - చైతూకి ఇది హ్యాట్రిక్ వెంచ‌ర్. ఇక నాగ్ తో `మ‌నం`, `సోగ్గాడే చిన్ని నాయ‌నా` త‌రువాత స్వ‌ర‌క‌ర్త‌ అనూప్ రూబెన్స్ కి ఇది హ్యాట్రిక్ మూవీ కాగా.. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో, అక్కినేని కాంపౌండ్ లో `సోగ్గాడే చిన్ని నాయ‌నా`, `రారండోయ్ వేడుక చూద్దాం` అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌కి ఇది హ్యాట్రిక్ ఫిల్మ్. అలాగే `గోపాల గోపాల‌`, `సోగ్గాడే చిన్ని నాయ‌నా` అనంత‌రం సంక్రాంతి సీజ‌న్ లో అనూప్ రూబెన్స్ కి ఇది హ్యాట్రిక్ సినిమా. మొత్తంగా.. `బంగార్రాజు`తో హ్యాట్రిక్స్ అంకం బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com