Home

»

Latest News

ఈ స‌మాజం రేపిస్టుల‌ని ప్రేమిస్తోంది

Jan 16, 2022

వివాదాస్ప‌ద అంశాల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌ళం విప్పే వాళ్లు చాలా త‌క్కువ మందే వుంటున్నారు. వాళ్ల‌లో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు చిన్మ‌యి శ్రీ‌పాద‌. సింగ‌ర్ గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపుల‌ర్ అయిన సింగ‌ర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటోంది. గ‌త కొంత కాలంగా వివాదాస్ప‌ద అంశాల‌పై త‌న స్వ‌రం వినిపిస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. అంతే కాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ బాధ‌లు చెప్పుకుంటున్న అమ్మాయిల‌కు స‌ల‌హాలిస్తూ మోర‌ల్ గా స‌పోర్ట్ చేస్తోంది.

సినీ ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం మొద‌లుపెట్టి త‌మిళ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌ణ‌లు సృష్టించింది. ఏకంగా ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత వైర‌ముత్తు లైంగిక వేధింపుల బండారం బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో ఆమెని త‌మిళ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నించి న‌టుడు రాధార‌వి త‌ప్పించడం అప్ప‌ట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. తాజాగా ఓ న‌టి లైంగిక వేధింపుల సంఘ‌ట‌న‌పై స్పందించి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

తాజాగా ఆమె మ‌ల‌యాళ న‌టి పార్వ‌తి తిరువోత్ కు అండ‌గా నిలిచింది. ఆమె లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా చిన్మ‌యి త‌ర‌హాలోనే పోరాటం చేసింది. దీంతో ఆమెకు మ‌ల‌యాళ ఇండస్ట్రీలో అవ‌కాశాలు త‌గ్గాయ‌ట‌. ఇదే విష‌యాన్ని పార్వ‌తి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. త‌ను న‌టించిన చిత్రాలు హిట్ గా నిలిచినా త‌న‌కు సినిమాలు రావ‌డం లేద‌ని, కావాల‌నే త‌న‌ని ప‌క్క‌న పెడుతున్నార‌ని వాపోయింది. ఈ వార్త చూసిన చిన్మ‌యి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నిజం మాట్లాడినందుకు పార్వ‌తి వంటి ఒక మంచి న‌టి అవ‌కాశాల్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. రేపిస్టుల‌ను మాత్ర‌మే స‌మాజం ప్రేమిస్తోంది` అంటూ ఘాటుగా స్పందించింది. ప్ర‌స్తుతం చిన్మ‌యి చేసిన ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com