మరో రెడ్డిగా మెగాస్టార్?
on Dec 4, 2020
ఇంద్రలో ఇంద్రసేనా రెడ్డిగా, సైరా.. నరసింహారెడ్డిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా కనిపించి.. రెండు సందర్భాల్లోనూ కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కట్ చేస్తే.. మరోసారి రెడ్డిగా సందడి చేయనున్నారట ఈ కొణిదెల స్టార్.
ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన పొలిటికల్ థ్రిల్లర్ లూసీఫర్ తెలుగులో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ లో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరు నటించబోతున్నారు. అంతేకాదు.. ఒరిజనల్ లో ఎలాగైతే లాల్ పాత్ర రెండు పేర్లతో ఉంటుందో అలాగే రీమేక్ లోనూ రెండు పేర్లు ఉంటాయట. రాయలసీయ నేపథ్యంలో సాగే పాత్రకి బైరెడ్డి అనే పేరుని అనుకుంటున్నారని వినికిడి. టైటిల్ గా కూడా అదే ఫిక్స్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. బైరెడ్డిగా చిరు ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే 2022 వరకు వేచిచూడాల్సిందే.
కాగా, ఈ రీమేక్ ని హనుమాన్ జంక్షన్ ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తమిళంలో పలు బ్లాక్ బస్టర్స్ అందించిన రాజా.. లాంగ్ గ్యాప్ తరువాత చేయబోతున్న తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం.