ఒకే నెలలో `మెగా బ్రదర్స్` సినిమాలు.. ఇదే ఫస్ట్ టైమ్!
on Dec 21, 2021

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. `అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి` (1996)తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఇటీవలే పాతికేళ్ళ సినీ ప్రస్థానం పూర్తిచేసుకున్నారు.
Also Read:సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న 'భీమ్లా నాయక్'
ఇదిలా ఉంటే.. పవన్ నటుడిగా కెరీర్ ఆరంభించినప్పటి నుంచి అంటే ఈ 25 ఏళ్ళ ప్రయాణంలో `మెగా బ్రదర్స్` (చిరంజీవి, పవన్ కళ్యాణ్) ఒకే నెలలో తమ చిత్రాలతో పలకరించిన సందర్భాలు లేవనే చెప్పాలి. 1998లో `తొలి ప్రేమ`, `చూడాలని వుంది!`.. 2004లో `గుడుంబా శంకర్`, `శంకర్ దాదా ఎంబీబీఎస్` చిత్రాలు నెలకు పైగా గ్యాప్ తో వరుస నెలల్లో సందడి చేశాయే తప్ప.. ఒకే నెలలో రిలీజ్ కాలేదు. అయితే, ఫస్ట్ టైమ్ 2022 ఫిబ్రవరి మాసం.. `మెగా బ్రదర్స్` చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారనుంది. తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరు నటించిన `ఆచార్య` ఫిబ్రవరి 4న రిలీజ్ కానుండగా.. అదే నెల 25న పవన్ తాజా చిత్రం `భీమ్లా నాయక్` తెరపైకి రానుంది.
Also Read:'హరిహర వీర మల్లు' కీలక అప్డేట్ వచ్చేసింది!
మరి.. ఫస్ట్ టైమ్ ఒకే నెలలో మూడు వారాల గ్యాప్ లో రాబోతున్న `మెగా బ్రదర్స్`.. ఆయా చిత్రాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



