ఛార్మి మంత్రం పారేనా..?
on May 13, 2014
రవ్వలడ్డు లాంటి ఈ అమ్మాయి తెలుగు వారికి ఒకప్పుడు బాగానే నచ్చింది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చి పడ్డాయి. పెద్ద హీరోలతో పాటు కుర్ర హీరోల పక్కన కూడా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు అడపాదడపా ఐటం సాంగ్ లలో మాత్రమే కనిపిస్తోంది. అవకాశాలు తక్కువైన తరుణంలో వచ్చిన ఏ ఆఫర్ ను తక్కువ చేయకుండా వీలైనంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మరీ కెరీర్ ను లాక్కొస్తోంది. ఆమెకు ఈ మధ్య వచ్చిన పూర్తి స్థాయి సినిమా మంత్ర-2. సినిమా ఛాన్స్ లు తక్కువ కావటంతో, చాన్స్ వచ్చిన సినిమాలో తన టాలెంట్ మొత్తం చూపిస్తోందట. అంతే కాదు, పగలు రాత్రి అనకుండా తెగ కష్టపడుతోందట. ఆ సినిమా కోసం చాలా నైటవుట్స్ కూడా చేస్తోందిట. మంత్ర-2 లాంటి సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ చిత్రాలు నైట్ టైంలోనే ఎక్కువగా షూటింగ్ చేస్తుంటారు. అయినా ఏ మాత్రం విసుగు లేకుండా యూనిట్ కి పూర్తిగా సహకరిస్తోందట ఛార్మి. కష్టే ఫలి అనే మంత్రాన్ని నమ్ముకున్న ఛార్మి మంత్రం మంత్ర2 విజయంతో నిజమవుతుందేమో చూడాలి.