గృహహింస కేసులో పెద్ద ట్విస్ట్.. హన్సిక పిటిషన్ రద్దు చేసిన కోర్టు
on Sep 11, 2025

ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)పూరి జగన్నాధ్(Puri Jagannadh)కాంబోలో వచ్చిన 'దేశముదురు' ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ నటి 'హన్సిక'(Hansika Motwani).ఈ చిత్రంలో 'వైశాలి' క్యారక్టర్ లో అద్భుతమైన పెర్ఫార్మ్ ప్రదర్శించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. దాంతో ఆమెకి పలు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. హిందీ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాలు చేసిన 'హన్సిక',కెరీర్ కి సంబంధించి పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం అందుకుంది.
కొన్ని రోజుల క్రితం హన్సిక, ఆమె తల్లి 'మోనా మోత్వానీ' పై హన్సిక సోదరుడి భార్య గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనం సృష్టించింది. తమపై నమోదైన కేసుని కొట్టి వెయ్యాలని రీసెంట్ గా బాంబే హైకోర్ట్ లో హన్సిక క్యాట్ పిటిషన్ వేసింది. కానీ హైకోర్ట్ పిటీషన్ ని కొట్టి వేసింది.
హన్సిక సోదరుడి పేరు ప్రశాంత్ మోత్వానీ. ప్రముఖ టివి నటి ముస్కాన్ జేమ్స్(Muskaan Nancy James)ని 2020 లో వివాహం చేసుకున్నాడు. కానీ మనస్పర్థలు ఏర్పడటంతో 2022 లో విడిపోయారు. ఆ సమయంలోనే హన్సిక , మోనా, ప్రశాంత్ లపై గృహ హింస కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసులో హన్సిక ఫ్యామిలికి బెయిల్ మాత్రం వచ్చింది. సినిమాల పరంగా చూసుకుంటే హన్సిక ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లోను చేస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



