పది రోజుల్లో 95 కోట్ల షేర్ రాబట్టిన 'భీమ్లా నాయక్'.. కానీ హిట్ అవ్వాలంటే?
on Mar 7, 2022

ఆరు రోజుల తర్వాత 'భీమ్లా నాయక్' కలెక్షన్స్ ఊహించని విధంగా డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. మళ్ళీ తొమ్మిదో రోజు కాస్త పుంజుకున్న భీమ్లా నాయక్.. పదో రోజు అంచనాలకు మించిన కలెక్షన్స్ తో సత్తా చాటింది. దీంతో పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 కోట్ల షేర్ రాబట్టింది ఈ సినిమా.
108 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగిన భీమ్లా నాయక్ ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 88 కోట్ల షేర్ కలెక్ట్ చేసి వకీల్ సాబ్ టోటల్ కలెక్షన్స్(రూ.86.36)ని దాటేసింది. అయితే ఏడో రోజు, ఎనిమిదో రోజు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు రూ.3.32 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ఏడో రోజు 98 లక్షలు, ఎనిమిదో రోజు 74 లక్షలకు పరిమితమైంది. తొమ్మిదో రోజు(శనివారం) వీకెండ్ కావడంతో కాస్త పుంజుకొని 1.07 కోట్లతో సత్తా చాటింది. పదో రోజు ఆదివారం కావడంతో మరోసారి కోటికి పైగా షేర్ రాబట్టే అవకాశముందని భావించారంతా. అయితే పదో రోజు అంచనాలకు మించి దాదాపు రెండు కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు భీమ్లా నాయక్ 1.90 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో 88.75 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ పది రోజుల్లో 74.11 కోట్లు రాబట్టింది. తెలంగాణలో 34.42 కోట్లు(35 కోట్ల బిజినెస్), ఆంధ్రప్రదేశ్ లో 39.69 కోట్లు(53.75 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో 9 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ పది రోజుల్లో 12.40 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా 9 కోట్ల బిజినెస్ చేసిన మూవీ ఇప్పటిదాకా 8.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటిన భీమ్లా ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోనూ లాభాల బాట పట్టనుంది. పదిరోజుల్లో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 94.66 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన భీమ్లా నాయక్ క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా 13.34 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ నెల 11 న 'రాధేశ్యామ్' విడుదల ఉండటంతో ఈ నాలుగు రోజులు బాక్సాఫీస్ దగ్గర భీమ్లా నాయక్ కలెక్షన్ల జోరు చూపించాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



